ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో సెక్రటరీ పదవిని జై షా నిర్వహించగా అతడు ఐసీసీ చైర్మన్గా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శిగా వైదొలిగాడు. కొద్దిరోజులుగా జై షా స్థానంలో తాత్కాలిక కార్యదర్శిగా పనిచేస్తున్న సైకియా.. ఆదివారం నుంచి పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టాడు. ఈ మేరకు ముంబైలో జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులు సైకియా, ప్రభ్జీత్ను ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. సైకియా, ప్రభ్తేజ్కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు శుభాకాంక్షలు తెలిపారు. హెచ్సీఏ ప్రతినిధిగా హాజరై వీరి అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ఆయన.. ఎన్నిక తర్వాత ప్రత్యేకంగా వారిని కలిసి తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.