హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు చెందిన ఆరుగురు క్రికెటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. వయసు నిబంధనలను అతిక్రమిస్తూ టోర్నీల్లో ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసుల నివేదిక ఆధారంగా బీసీసీఐ ఆరుగురు ప్లేయర్లపై వేటు వేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈనెల 4 నుంచి నవంబర్ 3, 2026 వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్కు గురైన వారిలో సాయిచంద్ర, ప్రేమ్, అనుదీప్, దివేశ్, ఆదిత్య, చిరాగ్ ఉన్నారు.