IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ విశాఖపట్టణంలోని అభిమానులను అలరించనుంది. సముద్రతీరం కలిగిన వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అక్షర్ పటేల్ లక్నోను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
ఈ సీజన్లో లక్నో పగ్గాలు అందుకున్న రిషభ్ పంత్.. ఢిల్లీని నడిపిస్తున్న అక్షర్ గతంలో కలిసి ఆడారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. దాంతో.. ఈ ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక.. ఈమధ్యే జట్టుతో కలిసిన శార్ధూల్ ఠాకూర్ లక్నో 11 మందిలో చోటు దక్కించుకున్నాడు.
ఢిల్లీ జట్టు : జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఫాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్.
లక్నో జట్టు : ఎడెన్ మర్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుస్ బదొని, రిషభ్ పంత్(వికెట్ కీపర్, కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రథీ, షాబాజ్ అహ్మద్, శార్థూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్.