ముంబైపై క్యాపిటల్స్ ఘన విజయం.. రాణించిన మిశ్రా, ధవన్
గతేడాది తమకు టైటిల్ దూరం చేసిన ముంబైపై ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో ఒత్తిడిని జయించి రోహిత్‌సేనను 5 మ్యాచ్‌ల ఓడించింది. ఈ సీజన్లో తొలిసారి బరిలోకి దిగిన అమిత్ మిశ్రా స్పిన్ మాయాజాలంతో ముంబైని కుప్పకూల్చాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో ధవన్ అదరగొట్టగా.. లలిత్ యాదవ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఒక్క వైడ్ కూడా వేయకపోవడం విశేషం కాగా పరిస్థితికి తగ్గట్టు బౌలర్లను వినియోగించి కెప్టెన్‌గానూ పంత్ మంచి మార్కులు సాధించాడు.
చెన్నై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసింది. మంగళవారం ఇక్కడి చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పంత్‌సేన 6 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచి.. ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఏడాది తొలి మ్యాచ్ ఆడిన ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (4/24) మ్యాజిక్ చూపడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టగా.. మిగిలిన వారెవరూ 30 పరుగుల మార్క్‌ను కూడా చేరుకోలేకపోయారు. అమిత్‌కు 4, అవేశ్‌కు రెండు వికెట్లు దక్కాయి. మోస్తరు లక్ష్యఛేదనలో శిఖర్ ధవన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, ఓ సిక్స్), స్టీవ్ స్మిత్ (33) రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. ముంబై బౌలర్లలో జయంత్, బుమ్రా, చాహర్, పొలార్డ్ చెరో వికెట్ పడగొట్టారు. మిశ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
ఓపెనర్ క్వింటన్ డికాక్ (2) త్వరగానే ఔటైనా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ (24) దంచికొట్టడంతో ఆరు ఓవర్లలోనే ముంబై 55 పరుగులు చేసింది. అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో యాదవ్ ఫోర్ బాదితే.. రోహిత్ 4,6 అరుసుకున్నాడు. తర్వాతి ఓవర్లో హిట్‌మ్యాన్ సిక్సర్ కొట్టాడు. అయితే జోరు మీదున్న సూర్య.. అవేశ్ ఖాన్ (2/15) వేసిన ఏడో ఓవర్లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 9వ ఓవర్లో ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ మిశ్రా ముంబైని చావుదెబ్బ కొట్టాడు. దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ను నాలుగో బంతికి పెవిలియన్ పంపిన మిశ్రా.. చివరి బాల్‌కు హార్దిక్ పాండ్యా (0) డకౌట్ చేసి దెబ్బకొట్టాడు. తర్వాతి ఓవర్లో కృనాల్ పాండ్య (1)ను లలిత్ యాదవ్ బౌల్డ్ చేయగా.. 12వ ఓవర్లో డేంజర్ మ్యాన్ కీరన్ పొలార్డ్ (2)ను అమిత్ ఎల్బీడబ్ల్యూ చేయడంతో ముంబై 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అనంతరం జయంత్ యాదవ్ (23)తో కలిసి ఇషాన్ కిషన్ (26) ఇన్నింగ్‌ను ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్నాడు. అయితే 39 పరుగుల పార్ట్నర్షిప్ తర్వాత మిశ్రా బౌలింగ్‌లో ఇషాన్ బౌల్డ్‌గా వెనుదిరగగా.. జయంత్ సైతం రబాడకు వికెట్ సమర్పించుకోవడంతో ముంబై చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు రాబట్టలేక స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
ముంబై నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఢిల్లీ కష్టంగా ఛేదించింది. తొలి ఓవర్లో ఢిల్లీ ఓపెనర్ ధవన్ బంతిని స్వల్పంగా గాల్లోకి లేపగా హార్దిక్ మెరుపు వేగంతో డైవ్ చేసి అందుకున్నా అది స్వల్పంగా గ్రౌండ్‌ను తాకినట్టు తేలింది. ఆ తర్వాత ఫోర్‌తో జోరు చూపిన యువ స్టార్ పృథ్వీ షా (7) జయంత్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. అనంతరం ధవన్, స్టీవ్ స్మిత్ (33) నిలకడగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో 8 ఓవర్లలో ఢిల్లీ 52 పరుగులకు చేరగా.. దూకుడు పెంచిన స్మిత్ 10వ ఓవర్లో ఔటయ్యాడు. లలిత్ యాదవ్ (22 నాటౌట్)తో కలిసి ధవన్ ఢిల్లీని లక్ష్యం వైపుగా నడిపించాడు. సింగిల్స్ తీయడంతో పాటు బౌండరీలు కొట్టాడు. అయితే చాహర్ వేసిన 15వ ఓవర్లో ధవన్ ఔట్ కాగా.. చివరి ఐదు ఓవర్లలో ఢిల్లీకి 37 పరుగులు అవసరమయ్యాయి. కెప్టెన్ పంత్ (7) ఔటయ్యాక బుమ్రా, బౌల్ట్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. చివర్లో హిట్మైర్ (14 నాటౌట్), లలిత్ పని పూర్తి చేశారు. ఒత్తిడి పెంచినా.. 19వ ఓవర్లో బుమ్రా రెండు నోబాల్స్ వేయడం ముంబై అవకాశాలను దెబ్బతీసింది.
ఢిల్లీ: పృథ్వీ (సి&బి) జయంత్ 7, ధవన్ (సి) హార్దిక్ (బి) చాహర్ 45, స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) పొలార్డ్ 33, లలిత్ (నాటౌట్) 22, పంత్ (సి) కృనాల్ (బి) బుమ్రా 7, హిట్మైర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 138/4. వికెట్ల పతనం : 1-11, 2-64, 3-100, 4-115. బౌలింగ్: బౌల్ట్ 4-0- 23-0, జయంత్ 4-0-25-1, బుమ్రా 4-0-32-1, కృనాల్ 2-0-17-0, రాహుల్ చాహర్ 4-0-29-1, పొలార్డ్ 1.1-0-9-1
ముంబై: రోహిత్ (సి) స్మిత్ (బి) అమిత్ 44, డికాక్ (సి) పంత్ (బి) స్టొయినిస్ 2, సూర్యకుమార్ (సి) పంత్ (బి) అవేశ్ 24, ఇషాన్ (బౌల్డ్) మిశ్రా 26, హార్దిక్ పాండ్య (సి) స్మిత్ (బి) అమిత్ 0, కృనాల్ (బౌల్డ్) లలిత్ 1, పొలార్డ్ (ఎల్బీడబ్ల్యూ) అమిత్ 2, జయంత్ (సి&బి) రబాడ 23, రాహుల్ చాహర్ (సి) పంత్ (బి) అవేశ్ 6, బుమ్రా (నాటౌట్) 3, బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 5. మొత్తం: 20 ఓవర్లలో 137/9. వికెట్ల పతనం: 1-9, 2-67, 3-76, 4-77, 5-81, 6-84, 7-123, 8-129, 9-135, బౌలింగ్: స్టొయినిస్ 3-0-20-1, అశ్విన్ 4-0-31-0, రబాడ 3-0-25-1, అమిత్ మిశ్రా 4-0-24-4, అవేశ్ 2-0-15-2, లలిత్ 4-0-17-1.
జట్టు ఆ గె ఓ నె,ర పా
బెంగళూరు 3 3 0 0.75 6
ఢిల్లీ 4 3 1 0.42 6
చెన్నై 3 2 1 1.19 4
ముంబై 4 2 2 0.18 4
కోల్‌కతా 3 1 2 -0.63 2
రాజస్థాన్ 3 1 2 -0.71 2
పంజాబ్ 3 1 2 -0.96 2
హైదరాబాద్ 3 0 3 -0.48 0
ఆ-ఆడినవి, గె-గెలుపు, ఓ-ఓటమి, నె.ర-నెట్ రన్‌రేట్, పా-పాయింట్లు