జడ్చర్ల టౌన్, మే1: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జడ్చర్లలో జరిగిన 69వ జాతీయస్థాయి అండర్-17 బాలుర జాతీయస్థాయి టోర్నమెంట్ విజేతగా ఢిల్లీ నిలిచింది. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ.. తమిళనాడుపై విజయం సాధించి టైటిల్ నెగ్గింది.
తమిళనాడు రన్నరప్‌గా నిలువగా ఉత్తరాఖండ్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గత నెల 26న మొదలైన ఈ టోర్నీలో వివిధ రాష్టాల నుంచి మొత్తం 31 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు మహబూబ్‌నగర్ డీఈవో ప్రవీణ్‌కుమార్ ట్రోఫీలు అందజేశారు.