IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ 58వ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడేలా ఉన్నాడు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో వర్షం పడుతోంది. దాంతో, పంజాబ్ కింగ్స్(Punjab Kings), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. మరికాసేపట్లో టాస్ అనగా మైదానంలో చినుకులు మొదలయ్యాయి. పిచ్ తడవకుండా సిబ్బంది ప్లాస్టిక్ కవర్లను కప్పి ఉంచారు. వాన తగ్గుముఖం పట్టాక టాస్ వేయన్నారు.
ప్లే ఆఫ్స్ బెర్తులకు పోటీ రోజురోజుకు తీవ్రం అవుతోంది. నాలుగు బెర్తుల కోసం ఏడు జట్లు నువ్వానేనా అన్నట్టు ఢీ కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది.
🚨 News 🚨
Toss in Match 58 between @PunjabKingsIPL and @DelhiCapitals in Dharamshala delayed due to rain.
Stay tuned for further updates.#TATAIPL | #PBKSvDC
— IndianPremierLeague (@IPL) May 8, 2025
ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. ఈ బిగ్ ఫైట్‌లో గెలిస్తే 15 పాయింట్లతో ఉన్న పంజాబ్.. ఆర్సీబీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లుతుంది. ఒకవేళ ఢిల్లీ విజయం సాధిస్తే మూడో స్థానానికి ఎగబాకుతుంది.