హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇంటర్ డీపీఎస్ జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్ టైటిల్ను కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కైవసం చేసుకుంది. డీపీఎస్ వరుసగా మూడో ఏడాదీ ఆతిథ్యమిచ్చిన ఈ క్రీడలు.. ఆదివారం ముగియగా ఈ యేడు 17 రాష్ర్టాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.
అండర్-10, 13, 15, 17 వయసు విభాగాల్లో ఇండియన్, కాంపౌండ్, రికర్వ్ క్యాటగిరీల్లో జరిగిన పోటీలకు గాను కొల్లూరు డీపీఎస్ మొదటి స్థానంతో మెరవగా రెండు, మూడు స్థానాల్లోనూ మియాపూర్, నాదర్గుల్ డీపీఎస్లు నిలిచాయి.