IND vs AFG : మరో మూడు రోజుల్లో భారత్(India), అఫ్గనిస్థాన్(Afghanistan) మధ్య టీ20 సిరీస్ మొదలు కానుంది. షెడ్యూల్ ప్రకారం స్వదేశంలో సెప్టెంబర్ 13వ తేదీన మొదటి మ్యాచ్ జరగాలి. ఇప్పటికే సన్నాహకాల్లో మునిగిపోయిన ఇరుజట్ల ఆటగాళ్లకు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. షెడ్యూల్ మారనుంది. భద్రతా కారణాలరీత్యా తొలి టీ20ని వాయిదా వేయాలని ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ సంఘాని (DDCA)కి ట్రాఫిక్ పోలీసులు లేఖ రాశారు. దాంతో.. మొదటి మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐ, ఏసీబీ నిర్ణయం తీసుకోనున్నాయి.
శ్రీలంక పర్యటనలో సిరీస్ విజయంతో జోరుమీదున్న టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్థాన్ను ఢీకొట్టనుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ షురూ కావాలి. కానీ, భద్రతా కారణాలరీత్యా షెడ్యూల్లో మార్పులు అనివార్యమనిపిస్తోంది. క్రిక్బజ్ కథనం ప్రకారం.. దేశ రాజధానిలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో బ్రిక్స్(BRICS) సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల రెండో రోజే తొలి టీ20 ఉంది. దాంతో, మ్యాచ్ను వాయిదా వేసుకోవాలని గురువారం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీ క్రికెట్ సంఘానికి లేఖ రాశారు.
Delhi Traffic Police has requested DDCA to reschedule the cricket match on 13th September between India and Afghanistan, at Arun Jaitley Stadium.
DDCA has told them it’s not their event and if any change in the date happens, it will be notified in due course: pic.twitter.com/nmyVoXgMGZ
— ANI (@ANI) September 10, 2026
భారత్, అఫ్గనిస్థాన్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగాలి. అయితే.. రాజధానిలో బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్నందున బందోబస్తులో పోలీసులు బిజీగా ఉండనున్నారు. ఈ పరిస్థితుల్లో స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లు చూసేందుకు సిబ్బంది కొరత ఉండనుంది. అందుకని మ్యాచ్ను ఒకరోజుకు వాయిదా వేయాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ సంఘానికి లేఖ రాశారు.
Delhi Traffic Police requests rescheduling of India-Afghanistan 1st T20I
Read @ANI Story| https://t.co/IsQPhxME6p #India #Afghanistan #T20ISeries #DelhiTrafficPolice #DDCA pic.twitter.com/x3kk4tQMz8
— ANI Digital (@ani_digital) September 10, 2026
అయితే.. డీడీసీఏ మాత్రం.. అంతర్జాతీయ టీ20 కావున తమ పరిధిలో ఉండదని.. ఒకవేళ తేదీలో ఏదైనా మార్పులు చేస్తే తెలియజేస్తామని పోలీసులకు తెలిపింది. పోలీసుల అభ్యర్థన నేపథ్యంలో సెప్టెంబర్ 13, ఆదివారం జరగాల్సిన మ్యాచ్ను సెప్టెంబర్ 14, సోమవారం ఆడించే అవకాశముంది. అయితే.. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లుఫిట్నెస్ సాధించడంతో వైట్వాష్పై టీమిండియా దృష్టి సారించనుంది.