IPL 2025 : వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. ఛేదనలో దూకుడగా ఆడే క్రమంలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అయినా సరే ఆల్‌రౌండర్ విప్రజ్ నిగమ్(20 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వకుండా ఆడున్నాడు. జాక్స్ ఓవర్లో వరుసగా 6, 6, ఫోర్ బాదిన అతడు.. సమీర్ రిజ్వీ(5)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మిస్తున్నాడు. చివరి బంతికి క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు. బంతి అతడి మోకాలికి తగిలి.. కింద పడింది. దాంతో ఊపిరి పీల్చుకుంది ఢిల్లీ. 6 ఓవర్లకు ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స నిర్దేశించిన 181 పరుగుల ఛేదనలో ఢిల్లీకి దీపక్ చాహర్ తన మొదటి ఓవర్లోనే షాకిచ్చాడు. ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్(6)ను ఔట్ చేశాడు. రెండు ఫోర్లు బాదిన ఓపెనర్ కేఎల్ రాహుల్(11)ను చాహర్ వెనక్కి పంపాడు. ఆ కాసేపటికే యువకెరటం అభిషేక్ పొరెల్(6)ను రికెల్టన్ స్టంపౌట్ చేసి ఢిల్లీని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. 27 పరుగులకే మూడు కీలక వికట్లు పడిన ఢిల్లీని విప్రజ్ నిగమ్(20 నాటౌట్), సమీర్ రిజ్వీ(5 నాటౌట్)లు ఆదుకునే పనిలో ఉన్నారు.
Triple delight for the hosts! 👏
A superb start with the ball for #MI sees #DC 49/3 after the powerplay 😮
2⃣ points loading for?
Updates ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/iaRYJjGi9r
— IndianPremierLeague (@IPL) May 21, 2025