DC vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) పదకొండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు (Royal Challengers Bangalore), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ ఫీల్డింగ్ తీసుకుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. గత మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన ఢిల్లీ మరో విజయంపై కన్నేసింది.
మరోవైపు.. ఈ టోర్నమెంట్లో ఎలాగైనా బోణీ కొట్టాలని స్మృతి మంధాన సేన పట్టుదలతో ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచులో ఢిల్లీ చేతిలో 60 పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఆ తర్వాత యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్‌పై కూడా దారుణంగా ఓడిపోయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, తారా నోరిస్. రాధా యాదవ్.
ఆర్సీబీ జట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), రీచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ డెవినే, హీథర్ నైట్, దిశా కసాత్, ఎలిసే పెర్రీ, శ్రేయాంక పాటిల్, అషా శోభన, ప్రీతీ బోస్, మేగన్ షట్, రేణుకా ఠాకూర్.