DC vs MI : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఏడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ బ్యాటింగ్ తీసుకుంది. ఈ లీగ్‌లో వరుసగా రెండు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ డీవై పాటిల్ స్టేడియంలో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి రెండు మ్యాచుల్లో రెండొందలు కొట్టిన ఆ జట్టు బలమైన ముంబైపై భారీ స్కోర్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండు మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ సేన ఢిల్లీని నిలువరిస్తుందా? అనేది ఆసక్తికరం. ఈ మ్యాచ్‌లో లానింగ్, షఫాలీ మరోసారి రాణిస్తే ఆ జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయం. ముంబై ఓపెనర్ హేలీ మాథ్యూస్ భీకర ఫామ్‌లో ఉంది. ఆమెతో పాటు హర్మన్‌ప్రీత్, అమేలియా కేర్ చెలరేగితే ముంబైని అడ్డుకోవడం ఢిల్లీకి కష్టమే.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), మిన్నూ మన్సీ, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్.
ముంబై ఇండియన్స్ : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ మ్యాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, ధారా గుజ్జర్, అమేలియా కేర్, పూజా వస్త్రాకర్, అమన్‌జోత్ కౌర్, జింతిమణి కలిత, ఇసీ వాంగ్, సైకా ఇషక్.
Toss Update 🚨@DelhiCapitals have won the toss and elected to bat first against @mipaltan#TATAWPL | #DCvMI pic.twitter.com/ptROQcCBqx
— Women’s Premier League (WPL) (@wplt20) March 9, 2023