న్యూయార్క్: కరాకస్‌లో జరిగిన అమెరికా సైనిక ఆపరేషన్‌లో బందీగా మారిన తర్వాత మొట్టమొదటిసారి సోమవారం న్యూయార్క్ కోర్టులో పదవీచ్యుత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో హాజరయ్యారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా అభియోగాలపై 63 ఏండ్ల మదురోను, ఆయన భార్య ఫ్లోరెస్(69)ను శనివారం కరాకస్‌లో నిర్బంధించి బలవంతంగా అమెరికాకు తరలించారు. బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో వారిని బందీలుగా ఉంచారు.