అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటిపై దాడి
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి జరిగింది. ఒహాయోలోని వాన్స్ నివాసంపై ఓ గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని సిన్సినాటి పోలీసులు తెలిపారు.
- పోలీసుల అదుపులో నిందితుడు
సిన్సినాటి, జనవరి 5: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి జరిగింది. ఒహాయోలోని వాన్స్ నివాసంపై ఓ గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని సిన్సినాటి పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇంటి కిటికీల అద్దాలు పగిలిపోయాయని పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో వాన్స్ కుటుంబసభ్యులెవరూ ఆ ఇంటిలో లేరని తెలిపారు. అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో జరిగిన దాడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ సిన్సినాటి పోలీసులకు సమాచారం అందించిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడి వాన్స్‌ను లక్ష్యంగా చేసుకొని జరిగిందా అన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం నిర్బంధించిన సమయంలో వాన్స్ తన ఒహాయోలోని నివాసానికి వెళ్లారు. వాన్స్ ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిన అనంతరం అర్ధరాత్రి దాడి జరిగినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

