వడోదరా: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పోరులో సత్తాచాటింది. శనివారం జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై ఘన విజయం సాధించింది. తద్వారా వరుసగా రెండో విజయంతో రెండో స్థానంలోకి దూసుకొచ్చింది.
ఆర్సీబీ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 15.4 ఓవర్లలో 111/3 స్కోరు చేసింది. లారా వోల్వార్డ్(42 నాటౌట్) రాణించగా, కెప్టెన్ రోడ్రిగ్స్(24) ఆకట్టుకుంది. సయాలీ(2/18) రెండు వికెట్లు తీసింది. తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీకి ఇదే అత్యల్ప స్కోరు. మందన(38) టాప్ స్కోరర్‌గా నిలిచింది. నందని(3/26), కాప్(2/17) ఆర్సీబీ పతనంలో కీలకమయ్యారు.