DC vs MI | కీలక పోరులో చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు.. ఢిల్లీ టార్గెట్ 110
WPL 2023 : టేబుల్ టాపర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్(Mumbai Indians) స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.ప్రధాన బ్యాటర్లు విఫలం కావడంతో 109 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (23), పూజా వస్త్రాకర్ (26) మాత్రమే రాణించారు.
DC vs MI : టేబుల్ టాపర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్(Mumbai Indians) స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ప్రధాన బ్యాటర్లు విఫలం కావడంతో 109 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లు చెలరేగడంతో ముంబై ఒత్తిడిలో పడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (23), పూజా వస్త్రాకర్ (26) మాత్రమే రాణించారు. చివర్లలో ఇసీ వాంగ్(23), అమన్‌జోత్ కౌర్ (19) ధాటిగా ఆడడంతో ముంబై వంద పరుగులు చేయగలిగింది.
శిఖా పాండే ఓవర్లో హర్మన్‌ప్రీత్ డీప్ మిడ్వికెట్లో కొట్టిన బంతిని బౌండరీ వద్ద జెమీమా క్యాచ్ అందుకుంది. దాంతో, 74 రన్స్ వద్ద ముంబై ఆరో వికెట్ పడింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మరిజానే కాప్, జెస్ జొనాసెన్ రెండేసి వికెట్లు తీశారు. అరుంధతి రెడ్డికి ఒక వికెట్ దక్కింది.
10 పరుగులకే 3 వికెట్లు
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. మరిజానే కాప్ పదునైన బౌలింగ్‌తో ముంబైని బెంబేలెత్తించింది. రెండో ఓవర్ తొలి బంతికి యస్తికా భాటియా(1)ను పెవిలియన్‌కు పంపింది. ఆ తర్వాతి బంతికే నాట్ సీవర్ బ్రంట్(0)ను బౌల్డ్ చేసింది. దాంతో, 10 పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. శిఖా పాండే ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్ మిడాన్‌లో డైవింగ్ క్యాచ్ పట్టడంతో హేలీ మాథ్యూస్(5) వెనుదిరిగింది. అమేలియా కేర్ (8)ను అరుంధతి రెడ్డి పెవలియన్ పంపింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్, పూజా వస్త్రాకర్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. వీళ్లు ఐదో వికెట్‌కు 38 రన్స్ జోడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

