IPL 2025 : ఆర్సీబీ నిర్దేశించిన 164 పరుగుల ఛేదనలో ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. 3 ఓవర్లకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. యశ దయాల్ బౌలింగ్‌లో ఫాఫ్ డూప్లెసిస్(2) రజత్ పటిదార్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(7)ను భువనేశ్వర్ వెనక్కి పంపాడు. జితేశ్ శర్మ ఒడుపుగా అందుకున్నాడు. దాంతో, 10 వద్దనే ఢిల్లీ 2 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(12), ఇంప్యాక్ట్ ప్లేయర్ అభిషేక్ పొరెల్(6) క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 30-2.
చిన్నస్వామి మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాపార్డర్ కుప్పకూలింది. టర్నింగ్ పిచ్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్లు రెచ్చిపోవడంతో పెవిలియన్‌కు క్యూ కట్టారు. పవర్ ప్లేలో ధాటిగా ఆడిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(37) టాప్ స్కోరర్. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడిన రజత్ పటిదార్(25), విరాట్ కోహ్లీ(22)లు విఫలమయ్యారు. అయితే.. టిమ్ డెవిడ్(37 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరును ఒడ్డున పడేశాడు. డెత్ ఓవర్లలో రెచ్చిపోయిన అతడు 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది జట్టు స్కోర్ 160 దాటించాడు. డేవిడ్ అద్భుత హిట్టింగ్తో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మంటూ ఉదేసిన ఢిల్లీని బెంగళూరు నిలువరిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.