ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో మరో ఆసక్తికర పోరు మరికాసేపట్లో ఆరంభంకానుంది. సీజన్ రెండో మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు వాంఖడే వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నలుగురు విదేశీ ఆటగాళ్ల కోటాలో స్టాయినీస్, హెట్‌మైర్, టామ్ కరన్, క్రిస్ వోక్స్‌లను తీసుకున్నట్లు పంత్ చెప్పాడు.
డుప్లెసిస్, మొయిన్ అలీ, శామ్ కరన్, డ్వేన్ బ్రావో తమ ఓవర్సీస్ ప్లేయర్లని చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఇంకా క్వారంటైన్లో ఉన్నారని, అయినప్పటికీ మేమంతా రెడీగా ఉన్నామని మహీ వివరించాడు.
ఇంగ్లీష్ క్రికెటర్లు టామ్ కరన్, క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్ ద్వారా ఢిల్లీ తరఫున అరంగేట్రం చేస్తున్నారు. టాస్ వేయడానికి ముందు ఇద్దరు ఆటగాళ్లు డీసీ క్యాప్‌లను అందుకున్నారు.
Match 2. Delhi Capitals XI: P Shaw, S Dhawan, A Rahane, R Pant, S Hetmyer, M Stoinis, C Woakes, T Curran, R Ashwin, A Mishra, A Khan https://t.co/JzEqukJJPb #CSKvDC #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 10, 2021
Match 2. Chennai Super Kings XI: F du Plessis, R Gaikwad, M Ali, S Raina, A Rayudu, MS Dhoni, R Jadeja, S Curran, DJ Bravo, S Thakur, D Chahar https://t.co/JzEqukJJPb #CSKvDC #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 10, 2021
.@DelhiCapitals Skipper @RishabhPant17 wins the toss and elects to bowl first against @ChennaiIPL.
— IndianPremierLeague (@IPL) April 10, 2021
Live – https://t.co/jtX8TWxySo #VIVOIPL #CSKvDC pic.twitter.com/sKGjc5y12U