శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 14, 2020 , 19:06:57

DC vs RR: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

DC vs RR:  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

దుబాయ్‌: ఐపీఎల్‌-2020లో మరో రసవత్తర పోరు జరగనుంది.  ఢిల్లీ క్యాపిటల్స్‌,  రాజస్థాన్‌ రాయల్స్‌  జట్లు   దుబాయ్‌  వేదికగా తలపడుతున్నాయి.  టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.  హర్షల్‌ పటేల్‌ స్థానంలో తుషార్‌ దేశ్‌పాండేను తుది  జట్టులోకి తీసుకున్నట్లు అయ్యర్‌ చెప్పాడు.  మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఓపెనర్‌గా వస్తాడని రాజస్థాన్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ వెల్లడించాడు. 

ఆడిన ఏడు మ్యాచ్‌లో ఐదు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సీజన్‌ ఆరంభం నుంచి తడబడిన రాజస్థాన్‌ ఏడు మ్యాచ్‌ల్లో  కేవలం మూడింటిలో మాత్రమే విజయ సాధించి పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో కొనసాగుతున్నది.  ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరచుకోవాలని ఢిల్లీ ఆసక్తిగా ఉంది.