కొవిషీల్డ్ రెండో డోసు 12 వారాల తర్వాతే.. పరిశీలిస్తున్న ఎక్స్పర్ట్ కమిటీ

న్యూఢిల్లీ: అసలే వ్యాక్సిన్లకు కొరత ఉంది. దీనికితోడు ఎంత ఆలస్యంగా ఇస్తే వ్యాక్సిన్ సామర్థ్యం అంత మెరుగ్గా ఉంటుందని చెబుతున్న అధ్యయనాలు. దీంతో కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే విరామాన్ని మరోసారి పెంచే ఆలోచన చేస్తోంది ఎక్స్పర్ట్ కమిటీ. దీనిపై వచ్చే వారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలిసారి వచ్చినప్పుడు రెండో డోసును 4 నుంచి 6 వారాల మధ్య తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత గత ఏప్రిల్‌లో ఇది 6-8 వారాల మధ్య అయితే వ్యాక్సిన్ మరింత మెరుగ్గా పని చేస్తుందంటూ కేంద్రం ప్రకటించింది.
ఇప్పుడు ఆ సమయాన్ని మరింత పెంచే ఆలోచన చేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో తయారీదారులపై ఒత్తిడి కాస్తయినా తగ్గే అవకాశం ఉంటుంది. గత మార్చి నెలలో లాన్సెట్‌లో ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. దాని ప్రకారం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 12 వారాల తర్వాత తీసుకుంటే సామర్థ్యం 81.3 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. అదే ఆరు వారాలలోపు తీసుకుంటే మాత్రం సామర్థ్యం 55.1 శాతంగా మాత్రమే ఉందని పరిశోధకులు వెల్లడించారు.
ఇక బ్రిటన్, బ్రెజిల్‌లలో జరిగిన చివరి దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ సామర్థ్యం 90 శాతం దాకా ఉంటున్నట్లు తేలింది. అయితే అది జరగాలంటే ముందు సగం డోసు ఇచ్చి నెల తర్వాత మొత్తం డోసు ఇవ్వాల్సి ఉంటుందని ఈ ట్రయల్స్ తేల్చాయి. ఇక ఇప్పటికే యూకే, కెనడాలాంటి దేశాలు 12 వారాలు, 16 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నాయి. రెండో డోసుల మధ్య ఎక్కువ సమయం ఉంటే మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇండియాలోనూ ఇదే అమలు చేస్తే వ్యాక్సిన్ల కొరతను కాస్తయినా అధిగమించే వీలుంటుంది. రెండో డోసు తీసుకునే వాళ్లు మరికొంత ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావడంతో ఆ మేరకు మరికొంత మందికి తొలి డోసు వేసే అవకాశం దక్కుతుంది. ఇలా వ్యాక్సిన్ల కొరతకు కాస్త చెక్ పెట్టవచ్చు. ఎక్కువ గ్యాప్ తర్వాత రెండో డోసు తీసుకుంటే ఎక్కువ రక్షణ ఉండటంతోపాటు ఆ లోపు కనీసం ఒక్క డోసు తీసుకున్న వారు కాస్తయినా సురక్షితంగా ఉంటారు. ఇలా రెండు రకాలుగా ఇది ఉపయోగపడనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

