ఢిల్లీ నాలుగోసారి.. ఎలిమినేటర్‌లో గుజరాత్‌పై ఘనవిజయం
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరింది. టోర్నీ ఆరంభ దశలో పడుతూ లేస్తూ ఆడిన ఆ జట్టు.. కీలకమైన ఎలిమినేటర్ పోరులో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది.
- బెంగళూరుతో టైటిల్ పోరుకు సిద్ధం
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరింది. టోర్నీ ఆరంభ దశలో పడుతూ లేస్తూ ఆడిన ఆ జట్టు.. కీలకమైన ఎలిమినేటర్ పోరులో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. వడోదరలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన పోరులో ప్రత్యర్థిని 7 వికెట్ల తేడాతో చిత్తుచేసిన ఢిల్లీ.. ఈనెల 5న (గురువారం) ఇదే వేదికలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని క్యాపిటల్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. లిజెల్లె లీ (24 బంతుల్లో 43, 8 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (23 బంతుల్లో 41, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 వద్దే పరిమితమైంది. బెత్ మూనీ (51 బంతుల్లో 62 నాటౌట్, 6 ఫోర్లు), జార్జియా వర్హెమ్ (35) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు.
ఆడుతూ పాడుతూ..
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎప్పట్లాగే ఢిల్లీకి ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. లీ, షెఫాలీ (21 బంతుల్లో 31, 7 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 75 రన్స్ చేసింది. మొదట రాజేశ్వరి 3వ ఓవర్లో షెఫాలీ రెండు బౌండరీలు బాదగా డివైన్ ఓవర్లో రెండు ఫోర్లతో కలుపుకుని 17 పరుగులొచ్చాయి. రేణుకా 5వ ఓవర్లో అయితే లీ హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగగా షెఫాలీ రెండుసార్లు బంతిని బౌండరీ లైన్ దాటించింది. వర్హెమ్ రాకతో గుజరాత్‌కు డబుల్ బ్రేక్ దక్కింది. ఆమె వేసిన 8వ ఓవర్ తొలి బంతికి లీ వికెట్ల ముందు దొరికిపోగా ఆఖరి బంతికి షెఫాలీ వర్హెమ్కే క్యాచ్ ఇచ్చి నిష్క్రమించింది. కానీ అప్పటికే ఢిల్లీ లక్ష్యంలో సగాన్ని ఊదేసింది. వారి స్థానాల్లో క్రీజులోకి వచ్చిన వోల్వార్ట్ (32*), జెమీమా నిలకడగా ఆడి ఆ జట్టును గెలుపు దిశగా మరింత చేరువ చేశారు. క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడిన జెమీమా.. విజయానికి 9 పరుగుల దూరంలో ఔట్ అయినా వోల్వార్ట్, కాప్ (4*) లాంఛనాన్ని పూర్తిచేశారు.
మూనీ ఒంటరి పోరాటం
రెండో ఓవర్లోనే డెవిన్ (6)వికెట్‌ను కోల్పోయినా పవర్ ప్లేలో గుజరాత్ నిలకడగానే ఆడింది. కాప్ వేసిన 4వ ఓవర్లో 17 పరుగులు రాబట్టి జోరు మీద కనిపించిన ఆ జట్టుకు ఆరో ఓవర్లో బంతినందుకున్న నందని వరుస బంతుల్లో షాకిచ్చింది. తొలి బంతికి అనుష్క (16)ను వెనక్కిపంపిన ఆమె.. రెండో బంతికి గుజరాత్ సారథి ఆష్లీ గార్డ్నర్ను డకౌట్ చేసి కోలుకోలేని దెబ్బకొట్టింది. దీంతో గుజరాత్ స్కోరు వేగం నెమ్మదించింది. 9వ ఓవర్లో మిన్ను మణి.. కనిక అహుజా (6)నూ బోల్తా కొట్టించడంతో క్రీజులోకి వచ్చిన వర్హెమ్ (35)తో కలిసి మూనీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. కానీ హెన్రీ 17వ ఓవర్లో గుజరాత్‌కు డబుల్ షాకులిచ్చింది. వర్హెమ్తో పాటు ఫల్మలిని ఔట్ చేసి ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేసింది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లకు 168/7 (మూనీ 62*, వర్హెమ్ 35, హెన్రీ 3/35, నందని 2/23);
ఢిల్లీ: 15.4 ఓవర్లకు 169/3 (లీ 43, జెమీమా 41, వర్హెమ్ 2/28, రాజేశ్వరి 1/33)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

