చెన్నై: ఐపీఎల్ పుణ్యమాని వరల్డ్‌క్లాస్ ప్లేయర్స్‌తో ఆడే అవకాశం యంగ్ ప్లేయర్స్‌కు దక్కుతోంది. తమ అభిమాన క్రికెటర్లతోనే కలిసి ఆడుతుండటాన్ని వాళ్లు తమ అదృష్టంగా భావిస్తున్నారు. తమ అభిమానాన్ని కూడా వాళ్లేమీ దాచుకోవడం లేదు. మంగళవారం ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మకు అలాంటి అభిమానే ఒకరు దొరికారు.
ప్రత్యర్థి టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అవేశ్ ఖాన్ మ్యాచ్ తర్వాత తన జెర్సీపై రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్ తీసుకోవడం విశేషం. అతని అభిమానానికి ఫిదా అయిన రోహిత్ ముసిముసిగా నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ ఫొటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సునాయాసంగా గెలిచిన విషయం తెలిసిందే.
The fanboy in Avesh Khan had to come out after the match ✍🏼🤗#YehHaiNayiDilli #DCvMI #IPL2021 pic.twitter.com/Qfp32SwUS8
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2021