ముంబై: టీ20 క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఢిల్లీ క్రికెట్ జట్టు తమ 11 మందిని బౌలింగ్ చేయించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఇందుకు వేదికైంది. శుక్రవారం గ్రూప్-సీలో మణిపూర్‌తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ తమ ఫైనల్ లెవన్‌లో ఉన్న ప్రతి ఒక్కరితో (వికెట్ కీపర్‌తో సహా) బౌలింగ్ చేయించింది. పొట్టి క్రికెట్లో ఇలా జరుగడం ఇదే ప్రథమం.
ఢిల్లీ బౌలర్లలో ఐదుగురు ఒక్కో ఓవర్ వేయగా ముగ్గురు తలా మూడు ఓవర్లు విసిరారు. మరో ఇద్దరు చెరో రెండు ఓవర్ల చొప్పున బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో మణిపూర్ 120/8 పరుగులకే పరిమితమవగా ఆ లక్ష్యాన్ని ఢిల్లీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది.