ODI World Cup | ప్రపంచ కప్ టోర్నీ-2023లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ డీకాక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 30వ ఓవర్లో కమిన్స్ వేసిన ఆరో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా స్టాండ్స్‌కు పంపడం ద్వారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు 31 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.