న్యూయార్క్: యూఎస్ ఓపెన్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జోకోవిచ్(Novak Djokovic) నిష్క్రమించాడు. ఇవాళ జరిగిన మూడవ రౌండ్ మ్యాచ్‌లో 28వ సీడ్ ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్సీ పాపిరిన్ 6-4, 6-4, 2-6, 6-4 స్కోరు తేడాతో జోకోవిచ్‌పై గెలుపొందాడు. శుక్రవారం మరో స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ కూడా యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. రెండో సీడ్ జోకోవిచ్.. 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. కానీ అతని దూకుడుకు యూఎస్ ఓపెన్‌లో తీవ్ర అడ్డు తగిలింది. జూన్‌లో మోకాలి సర్జరీ చేయించుకున్న జోకోవిచ్.. ఈ ఏడాది ఒక్క మేజర్ గ్రాండ్‌స్లామ్ కూడా గెలవలేకపోయాడు. 37 ఏళ్ల జోకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో పది సార్లు ఫైనల్లోకి ప్రవేశించాడు. 2011, 2015, 2018, 2023లో టైటిల్స్ గెలిచాడు. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అతను 14 సార్ల డబుల్ ఫాల్ట్ చేశాడు. శారీరకంగా అలసిపోయినట్లు కనిపించాడు.
Alexei Popyrin just claimed the biggest win of his career! pic.twitter.com/iYcCxnWmfX
— US Open Tennis (@usopen) August 31, 2024