హైదరాబాద్ : మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో.. అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం గతంలో జీవితఖైదు విధించింది.
దాంతో జీవితఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్ పిటిషన్ దాఖలు చేశాడు. అదేవిధంగా తన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో అతని వయసు, జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. కాగా అమృత కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ కుమార్ కిరాయి హంతకులను పెట్టి ప్రణయ్‌ని హత్యచేశారు.