Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో కలిసి చేస్తున్న సినిమా ఇండస్ట్రీలో భారీ ఆసక్తిని రేపుతోంది. AA22 x A6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను పాన్–వరల్డ్ స్థాయిలో, గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సౌత్ సినిమా మాత్రమే కాదు, బాలీవుడ్ అభిమానుల్లో కూడా ఈ రూమర్ పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వార్త ప్రకారం బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని, ఇది నార్త్–సౌత్ మల్టీస్టారర్‌గా ఉండబోతుందనే ప్రచారం జరిగింది.
కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ వార్తలకు వాస్తవంతో ఎలాంటి సంబంధం లేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ మూవీలో టైగర్ ష్రాఫ్ భాగం కావడం లేదని విశ్లేషకులు క్లియర్‌గా చెబుతున్నారు. అధికారిక ప్రకటన లేకుండానే వచ్చిన ఈ రూమర్స్‌కి ఇప్పుడు పూర్తి స్థాయిలో బ్రేక్ పడినట్టే. మరోవైపు, ఈ సినిమాను డైరెక్టర్ అట్లీ పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నట్లు టాక్. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం మేకర్స్ భారీగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. వీఎఫ్ఎక్స్కే సుమారు 400 కోట్ల వరకు ఖర్చు చేసే ఆలోచనలో ఉన్నారట. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం మొత్తం బడ్జెట్ పరంగా 700 కోట్ల మార్క్‌ను దాటే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే, అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించనుండగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ఫుల్ రోల్లో మెరవనున్నారు. అదనంగా రమ్యకృష్ణ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని సమాచారం.మొత్తానికి, భారీ బడ్జెట్, భారీ తారాగణం, హైటెక్ విజువల్స్‌తో అల్లు అర్జున్- అట్లీ సినిమా ఇండియన్ సినిమాకు కొత్త బెంచ్ మార్క్‌గా నిలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. టైటిల్‌తో పాటు మరిన్ని అఫీషియల్ అప్డేట్స్ త్వరలోనే వెలువడనున్నాయి.