ముంబై : భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(Deepti Sharma).. టీ20ల్లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచారు. ర్యాంకింగ్స్‌లో ఆమె ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకున్నది. ఆ ఆల్‌రౌండర్ తొలిసారి తన కెరీర్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దీప్తి శర్మ దుమ్ము రేపింది. ఈ నేపథ్యంలో ఆమె ర్యాంక్ మరింత మెరుగైంది. ఇక వన్డే బ్యాటర్లలో స్మృతి మంథానా తన నెంబర్ వన్ బ్యాటింగ్ పొజీషన్‌ను చేజార్చుకున్నది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్వార్డ్ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది.
ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సుదరల్యాండ్.. టీ20 బౌలర్ల జాబితాలో ఆగస్టు నుంచి నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. అయితే తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ తీసిన దీప్తి శర్మ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నది. దీంతో ఆమె టాప్ ర్యాంక్ కొట్టేసింది. 8 వికెట్ల తేడాతో ఇండియా ఆ మ్యాచ్‌లో గెలవగా, దీప్తి శర్మకు అయిదు కీలకమైన పాయింట్లు వచ్చేశాయి. దీంతో ఆ స్టార్ ఆల్‌రౌండర్ ఒక పాయింట్ తేడాతో ఆస్ట్రేలియా బౌలర్ కన్నా ముందు నిలుచుంది.
టీ20 బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ టాప్ టెన్‌లోకి చేరుకున్నది. ఆమె ప్రస్తుతం 9వ స్థానంలో నిలుచున్నది. లంకతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆమె టాప్ 10లోకి ప్రవేశించింది. టాప్ టెన్‌లో మంధానా, షఫాలీ శర్మ కూడా ఉన్నారు. వన్డే బ్యాటర్ల జాబితాలో మంధానా రెండో స్థానంలో ఉన్నది.
A big week on the ICC Women’s Player Rankings with a pair of new No.1s 😲
Details 👇https://t.co/3mt0k6Vtnq
— ICC (@ICC) December 23, 2025