టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ఆట ప్రారంభమయ్యింది. తొలిరోజు ఆర్చరీ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్ రౌండ్ పూర్తయింది. ఇందులో భారత ఆర్చర్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత ర్యాకింగ్స్లో 72 బాణాలు సంధించిన దీపికా.. మొత్తం 663 స్కోరు సాధించింది. తొలి మూడు స్థానాల్లో దక్షిణ కొరియా ఆర్చర్లు నిలిచారు. దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆన్ సాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆమె 680 స్కోరు సాధించింది. గతంలో తన పేరిటే ఉన్న రికార్డును ఆమె చెరిపివేసింది. గత ఒలిపిక్స్లో సాన్ 673 స్కోర్ రికార్డు చేసింది. 677 స్కోర్‌తో జంగ్ మిన్హే, 675 స్కోర్‌తో చయంగ్ కాంగ్ తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు.
జపాన్ రాజధాని టోక్యోలో మరికొన్ని గంటల్లో విశ్వక్రీడల ఆరంభ ఘట్టం అట్టహాసంగా ప్రారంభం కానుంది. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగే టోక్యోలోని ఒలింపిక్స్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభ వేడుకలు మొదలుకానున్నాయి. నాలుగేళ్ల ఒకసారి జరిగే ఈ అంతర్జాతీయ క్రీడలను జపాన్ చక్రవర్తి నరుహిటో లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వాగత ప్రసంగాలు, ఆయా దేశాల జాతీయజెండాల ఎగురవేత, క్రీడాకారుల పరేడ్, ఆతిథ్య దేశం తమ సాంస్కృతి, సంప్రదాయాలు, ఔనత్యాన్ని చాటేలా కళాకారుల ఆటపాటలు విశ్వక్రీడల ప్రారంభ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తారు.
ఈసారి పరేడ్‌లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్యను కుదించారు. గతంలో 10 వేలకుపైగా క్రీడాకారులు ప్రారంభ వేడుకల పరేడ్‌లో పాల్గొనేవారు. ఎక్కువమంది కళాకారులతో కూడిన ప్రదర్శనలను ప్రీ-రికార్డింగ్ చేసి ప్రసారం చేయనున్నారు. మరికొన్ని లైవ్ ప్రోగ్రాంలూ నిర్వహించనున్నారు. కరోనా నిబంధనల మధ్య విశ్వ క్రీడల ఆరంభ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో మూవింగ్ ఫార్వర్డ్ థీమ్‌తో ఒలింపిక్స్ వేడుకలు నిర్వహిస్తుండగా.. యునైటెడ్ బై ఎమోషన్ అనే థీమ్‌తో టోక్యో-2020 ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంరంభం జరగనుంది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో ముందు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెయ్యి మంది ప్రముఖల సమక్షంలోనే ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను జపాన్ చక్రవర్తి నరుహిటో ప్రారంభించనుండగా.. ఆయన సతీమణి మహారాణి మసకొ మాత్రం దూరంగా ఉండనున్నారు. నరుహిటో తండ్రి చక్రవర్తి అఖిహిటో 1998 నగనో వింటర్ గేమ్స్‌ను ప్రారంభించగా.. ఆయన తాత హిరోహిటో 1964 టోక్యో సమ్మర్ గేమ్స్, 1972 సప్పొరో వింటర్ గేమ్స్ ప్రారంభించారు.
Stay tuned as @ImDeepikaK begins her journey at #Tokyo2020 in a few minutes.
— SAI Media (@Media_SAI) July 22, 2021
Wish her luck! #Cheer4India @PMOIndia @ianuragthakur @NisithPramanik @YASMinistry @WeAreTeamIndia @indian_archery https://t.co/vIAuHfI6de
Live Update | #Tokyo2020
— SAI Media (@Media_SAI) July 23, 2021
Women's Individual Ranking Round | After 24 of 72 Arrows 👇 pic.twitter.com/i2tuIirRb9