IPL 2025 : సొంతమైదానంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. వరుసగా వికెట్లు తీస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లను వణికిస్తున్నారు. దీపక్ చాహర్(2-19) విజృంభణతో కోల్‌కాతా టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు చేతులెత్తేయగా.. కెప్టెన్ అజింక్యా రహానే(11) సైతం డగౌట్ చేరాడు. ప్రస్తుతం అంగ్క్రిష్ రఘువంశీ(25), రింకూ సింగ్(0) క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్.. 41-4.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ట్రెంట్ బౌల్ట్ ఆదిలోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డేంజరస్ సునీల్ నరైన్(0)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్(1)ను దీపక్ చాహర్ వెనక్కి పంపాడు.
#MI‘s Opening Bowlers 🆚 #KKR‘s Opening Batters
And it’s the @mipaltan‘s bowlers who win the opening act 💙#KKR 25/2 after 3 overs.
Updates ▶ https://t.co/iEwchzEpDk#TATAIPL | #MIvKKR pic.twitter.com/eoundLJeE5
— IndianPremierLeague (@IPL) March 31, 2025
ఆ కాసేపటికే కెప్టెన్ అజింక్యా రహానే(11)ను అశ్వనీ కుమార్ బోల్తా కొట్టించాడు. 25కే మూడు కీలక వికెట్లు పడిన దశలో కుర్రాళ్లు అంగ్క్రిష్ రఘువంశీ(25), వెంటకేశల్ అయ్యర్(3)లు ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ, చాహర్ మరోసారి తన పేస్ పవర్ చూపిస్తూ అయ్యర్‌ను ఔట్ చేసి డిఫెండింగ్ చాంపియన్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.