ఢిల్లీ: భారత ట్రాక్ అథ్లెట్ కెఎం దీక్ష మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది. లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న సౌండ్ రన్నింగ్ ట్రాక్ ఫెస్ట్‌లో భాగంగా శనివారం ముగిసిన ఫైనల్ రేసును 4:4.78 నిమిషాలలో పూర్తిచేసిన దీక్ష మూడో స్థానంలో నిలిచింది. 2021లో హర్మినల్ బెయిన్స్ నెలకొల్పిన 4:05.39 నిమిషాల రికార్డును బ్రేక్ చేసింది. ఇదే టోర్నీలో మహిళల 5 వేల మీటర్ల రేసును పారుల్ చౌదరి 15:10.69 నిమిషాల్లో పూర్తిచేసి ఐదో స్థానం దక్కించుకుంది. పురుషుల 5 వేల మీటర్ల రేసులో అవినాష్ సాబ్లె.. 13:19.30 నిమిషాల్లో పూర్తిచేసి పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.