Sreesanth : భారత మాజీ పేసర్ శ్రీశాంత్ (Sreesanth) ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ‘చెంప దెబ్బ'(Slapgate) వీడియో విడుదల చేయడంతో నెట్టింట వైరలైన ఈ పేసర్.. ఇప్పుడు సుప్రీంకోర్టు చుట్టూ తిరగనున్నాడు. ఐపీఎల్లో శ్రీశాంత్ ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ బీమా పరిహారం గురించి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దాదాపు పదేళ్ల క్రితం నాటి కేసులో కోర్టు మెట్లు ఎక్కనున్నాడు ఈ మాజీ స్పీడ్‌స్టర్. అసలు ఏం జరిగిందంటే..?
ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ స్క్వాడ్‌లోని ఆటగాళ్లకు బీమా చేయిస్తాయి. వారు గాయపడినప్పుడు భారీగా వైద్య ఖర్చులు అవుతాయి కదా. మొదట తామే బిల్లు చెల్లించినా తర్వాత సదరు బీమా సంస్థ నుంచి క్లెయిమ్ చేసుకుంటాయి. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా తమ ఆటగాళ్లందరికీ యూనైటెడ్ ఇండియా ఇన్షూరెన్స్ (United India Insurance Co) కంపెనీలో రూ. 8.7కోట్లకు బీమా చేయించింది. అయితే.. శ్రీశాంత్ విషయంలో రాజస్థాన్‌కు ఆ బీమా కంపెనీ మాత్రం షాకిచ్చింది.
Rajasthan Royals stated that Sreesanth missed the 2012 season due to a knee injury, while United India Insurance Company argued he was already carrying a toe injury that would have ruled him out of the league regardless.#IPL #RajasthanRoyals #Sreesanth #CricketTwitter pic.twitter.com/kPpOj7jmAA
— InsideSport (@InsideSportIND) September 2, 2025
శ్రీశాంత్‌కు 2012 సీజన్లో మోకాలికి గాయమైంది. దాంతో, అతడు సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రాజస్థాన్ అతడి వైద్యుల ఖర్చుల బిల్లు రూ.82 లక్షలు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసింది. కానీ, యూనైటెడ్ ఇండియా కంపెనీ మాత్రం కుదరని చెప్పేసింది. అప్పటికే శ్రీశాంత్ 2011 నుంచి పాదం బొటన వేలు (Toe Injury) గాయంతో బాధ పడుతున్నాడని క్లెయిమ్‌ను తిరస్కరించింది. అంతేకాదు.. గాయం నుంచి కోలుకుంటున్న పేసర్‌ను ఆ సీజన్లో ఆడించడం ఫ్రాంచైజీ తప్పిదమే అని స్పష్టం చేసింది ఇన్షూరెన్స్ కంపెనీ.
అతడు సీజన్‌కు దూరం కావడానికి పాత గాయమే కారణమని భావించిన యునైటెడ్ ఇండియా ప్రతినిధులు.. బీమా చేయించే ముందు తమకు ఆ విషయాన్ని తెలియజేయాల్సిందని రాజస్థాన్ యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే.. శ్రీశాంత్‌కు అయిన బొటన వేలు గాయం ఏమంత పెద్దది కాదని, అతడు టోర్నీ నుంచి వైదొలగడానికి మోకాలి గాయమే కారణమని ఫ్రాంచైజీ కౌంటర్ ఇచ్చింది.
had it happened to a footballer,the entire team would have engaged in a fight and rightly so ,here sreeshant’s team members were only consoling him . https://t.co/vwy3CL8gnj
— a (@UnfilteredMe70) August 29, 2025
ఈ విషయమై జాతీయ వినియోగదారుల అభ్యర్థనల కమిషన్ (NCDRC) గతంలో రాజస్థాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. యునైటెడ్ ఇండియా కంపెనీ రూ.82 లక్షలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే.. కమిషన్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీమా కంపెనీ. సో.. ఈ విషయాన్ని తేల్చేందుకు సిద్ధమైన అత్యున్నత కోర్టు శ్రీశాంత్ ఫిట్నెస్ సర్టిఫికెట్, పాదం గాయం గురించిన పత్రాలను సమర్పించాలని సూచించింది. ఇరువర్గాల వాదనలు విన్నాక ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటోందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.