IPL All time XI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే విధ్వంసక బ్యాటర్లు కళ్ల ముందు మెదలుతారు. తమదైన షాట్లతో, దూకుడుతో అభిమానులను అలరించిన ఆటగాళ్లు చాలామందే. వీళ్లలో పదకొండు మందిని ఎంపిక చేయడం చాలా కష్టమే. కానీ, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB de Villiers) ఆ సాహసం చేశాడు. తనతో పాటు ఆడిన, తాను చూసిన గొప్ప ఆటగాళ్లను ఏరికోరి తుది జట్టులోకి తీసుకున్నాడీ మిస్టర్ 360. అయితే.. ఆశ్చర్యకరంగా ఏడుగురు భారత క్రికెటర్లు అతడి తుది జాబితాలో ఉండడం విశేషం.
గత 18 సీజన్లలో ఐపీఎల్‌పై చెరగని ముద్ర వేసిన రోహిత్ శర్మ, మాథ్యూ హేడెన్లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు డివిలియర్స్. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీని సారథిగా ఈ సఫారీ మాజీ ప్లేయర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ టీమ్‌ను ఆదివారం ప్రకటించాడు.గత 18 సీజన్లలో ఐపీఎల్‌పై చెరగని ముద్ర వేసిన రోహిత్ శర్మ, మాథ్యూ హేడెన్లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు డివిలియర్స్.
AB DE VILLIERS PICKS HIS ALL TIME IPL XI: (Shubhankar Mishra).
– Rohit, Hayden, Kohli, Surya, ABD, Hardik, Dhoni, Bumrah, Chahal, Malinga, Vettori. pic.twitter.com/1JJPLngWAB
— CriCWeek (@cricweek) August 3, 2025
డివిలియర్స్ ఐపీఎల్ ఆల్‌టైమ్ జట్టులో భారత మాజీ ఆటగాళ్లకు పెద్ద పీట వేశాడు. ఏకంగా ఏడుగురిని తీసుకున్నాడీ విధ్వంసక బ్యాటర్. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు మిడిలార్డర్ బ్యాటర్లుగా చోటు సంపాదించగా.. ఎంఎస్ ధోనీ వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్ బౌలింగ్ దళంలో ఉండగా.. శ్రీలంక వెటరన్ లసిత్ మలింగ, న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ డానియల్ వెటోరీలు ఆల్‌టైమ్ జట్టులో స్థానం సాధించారు.
డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు : రోహిత్ శర్మ, మాథ్యూ హేడెన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్). జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్, లసిత్ మలింగ, డానియెల్ వెటోరీ.