IPL 2024 RCB vs LSG | డికాక్ సూపర్ ఫిఫ్టీ.. దంచేసిన పూరన్.. ఆర్సీబీ టార్గెట్..?
IPL 2024 RCB vs LSG : చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (81) సూపర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. చివర్లో నికోలస్ పూరన్(40 నాటౌట్ : 20 బంతుల్లో...
IPL 2024 RCB vs LSG : చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (81) సూపర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. చివర్లో నికోలస్ పూరన్(40 నాటౌట్ : 20 బంతుల్లో ఒక ఫోర్, 5 సిక్సర్లు) ఉతికారేశాడు. టాప్లే వేసిన 19వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో లక్నోకు కొండంత స్కోర్ అందించాడు. దాంతో, కేఎల్ రాహుల్ సేన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 రన్స్ కొట్టింది. ఆర్సీబీ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో ఆర్సీబీ బౌలర్లకు లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్(20), డికాక్(81)లు చుక్కలు చూపించారు. అయితే.. మ్యాక్స్‌వెల్ తన స్పిన్ మాయాజాలంతో రాహుల్‌ను ఔట్ చేసి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు. మరో ఎండ్‌లో తొలి ఓవర్ నుంచే దంచిన డికాక్ ఐపీఎల్లో 22వ ఫిఫ్టీ బాదాడు. ఇక విధ్వంసక ఆల్‌రౌండర్ జతగా డికాక్ రెచ్చిపోయాడు.
Innings Break!
A solid innings from Quinton de Kock & a fine finish from Nicholas Pooran 👏👏#LSG set a target of 1️⃣8️⃣2️⃣ for #RCB
Will be chased or will #LSG get their 2nd win on the trot? 🤔
Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/6uJZpYxFOb
— IndianPremierLeague (@IPL) April 2, 2024
వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యంతో లక్నోను ఆదుకున్నారు. అయితే.. ధాటిగా ఆడుతున్న మార్కస్ స్టోయినిస్(24)ను మ్యాక్సీ ఔట్ చేశాడు. దేవ్‌దత్ పడిక్కల్(6) స్వల్ప స్కోరకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పూరన్ విధ్వంసం సృష్టించాడు. 20 బంతుల్లో ఐదు సిక్సర్లతో 40 రన్స్ చేసి లక్నోకు భారీ స్కోర్ అందించాడు.
106m monstrous six! 🤯
Nicholas Pooran smashes one out of the park 💥
💯 sixes in #TATAIPL for the @LucknowIPL batter 💪
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE #RCBvLSG pic.twitter.com/7X0Yg4VbTn
— IndianPremierLeague (@IPL) April 2, 2024
ఇవి కూడా చదవండి
- IPL 2024 RCB vs LSG | డికాక్ 22వ హాఫ్ సెంచరీ.. 15 ఓవర్లకు లక్నో స్కోర్..?
- B Tax | రాష్ట్రంలో కొత్తగా ‘బీ’ ట్యాక్స్.. ఆ కమీషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
- Raghunandan Rao | బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

