SRH vs RR | సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. 15వ ఓవర్లో నాలుగో బంతికి ట్రావెస్ హెడ్ (58) ఔటయ్యాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌తో రికార్డు సృష్టించిన హైదరాబాద్ ఆటగాళ్లను ఆది నుంచి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టడిచేస్తూనే ఉన్నారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 37 పరుగుల వద్దే పరిమితమయ్యింది. దీంతో చాలాసేపు నిలకడగా ఆడిన హెడ్ తర్వాత జోరు పెంచాడు. అతనికి నితీశ్ రెడ్డి తోడయ్యాడు. ఇద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్‌ను అందించారు. కానీ 15వ ఓవర్లో హెడ్ ఔటయ్యి.. పెవిలియన్‌కు చేరాడు. కాగా, 15 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ 131/3. ప్రస్తుతం క్రీజులో నితీశ్ రెడ్డి (49), హెన్రిచ్(0) ఉన్నారు.