ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) హిట్టర్లు ఉతికేశారు. తొలుత ఓపెనర్ క్వింటన్ డికాక్(65) సిక్సర్లతో హోరెత్తించాడు. మిడిలార్డర్‌ను .. డేవిడ్ మిల్లర్(43)మరో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 163 రన్స్ కొట్టింది.
సెయింట్ లూయిస్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ టాస్ గెలిచి సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కానీ, ఇంగ్లండ్ బౌలర్లను దక్షిణాఫ్రికా ఓపెనర్లు సమర్దంగా ఎదుర్కొన్నారు. ఈ మెగా టోర్నీలో డికాక్, హెండ్రిక్స్(19) జోడీ తొలిసారి 50 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నిర్మించింది. పవర్ ప్లేలో దంచిన డికాక్.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో అరోన్ జోన్స్(Aaron Jones) రికార్డును సమం చేశాడు. అయితే.. మోయిన్ అలీ ఈ జోడిని విడదీసి ఇంగ్లండ్‌కు బ్రేకిచ్చాడు.
Jos Buttler is on fire 🔥🔥🔥#ENGvSA | #T20WorldCup pic.twitter.com/d8flEhz3FX
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2024
ఆ కాసేపటికే బట్లర్ సూపర్ త్రోతో డేంజరస్ హెన్రిచ్ క్లాసెన్(8)ను రనౌట్ చేసి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత ఆదిల్ రషీద్..ఎడెన్ మర్క్రమ్(1)లను ఔట్ చేశాడు. . అక్కడితో స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఆ సమయంలో మిల్లర్ బ్యాట్ ఝులిపించాడు. బౌండరీలతో చెలరేగి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వికెట్లు పడగొట్టారు.