World Cup Star : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా (South Africa) జైత్రయాత్ర కొనసాగుతోంది. అదిరే ఆటతో వరుసగా ప్రత్యర్థులకు చెక్ పెడుతూ తొలి ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఒత్తిడిలోనూ అద్భుత విజయాలు సాధిస్తున్న సఫారీ టీమ్‌కు కొండంత బలం మాత్రమే ఒకేఒక్కరు. ఆమే ఆల్‌రౌండర్ నడికెనే డీక్లెర్క్ (Nadine de Klerk). విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగుతూ.. అలవోకగా సిక్సర్లు బాదేస్తూ.. ఒంటిచేత్తో జట్టుకు భారీ స్కోర్లు అందిస్తోందీ ఫినిషర్. టీనేజ్‌లో హాకీ, జావెలిన్ త్రోలో రాణించిన డీక్లెర్క్.. క్రికెట్లోనూ వండర్ గర్ల్ అనిపించుకుంటోంది. భారత్‌పై మెరుపు హాఫ్ సెంచరీతో మొదలైన ఆమె పరుగుల ప్రవాహం.. పాక్‌పై సుడిగాలి ఇన్నింగ్స్ వరకూ నిరాటంకంగా కొనసాగుతుండడం విశేషం.
జాతీయ జట్టుకు ఎంపికవ్వడమే గొప్ప అనుకుంటే.. అంతర్జాతీయ వేదికల్లో దేశాన్ని గెలిపించడం మహోన్నతమైన విషయం. ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్‌లో నడినే డీక్లెర్క్ తమదేశ ప్రజలు గర్వపడేలా ఆడుతోంది. ఒకప్పుడు హాకీ, జావెలిన్ త్రో ఆటల్లో రాణించిన.. తను క్రికెట్ వైపు మళ్లింది. 2017లో భారత జట్టుపైనే అరంగేట్రం చేసిన డీక్లేర్క్ బలం ఆమె పవర్ హిట్టింగ్. అలవోకగా సిక్సర్లు బాదడం.. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా పరుగులు సాధించడం ఈ యంగ్‌స్టర్ ప్రత్యేకత. మూడేళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన తను.. 2023లో పాకిస్థాన్‌పై సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంది. బిగ్‌బాష్ లీగ్, ది హండ్రెడ్, డబ్ల్యూపీఎల్.. వంటి ఫ్రాంచైజీ క్రికెట్లోనూ దుమ్మురేపుతున్న డీక్లెర్క్.. పదమూడో సీజన్ మహిళల వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ట్రంప్ కార్డ్‌గా మారింది.
Not a comparison, but the impact Nadine de Klerk has created in CWC 2025 reminds me of what Klusener did in ’99- fearless, clutch, and unstoppable. 💥
Hopefully, this time 🇿🇦 go all the way to their maiden World Cup win! #CWC25 #Afghanistan #CricketTwitter #Cricket26 #SAvsPAK pic.twitter.com/f7E1aVwhfG— S@NDY (@Sandeep20505434) October 21, 2025
టెయిలెండర్‌గా క్రీజులోకి వస్తున్న డీక్లెర్క్.. వీరకొట్టుడుతో మేటి బౌలర్లను సైతం హడలెత్తిస్తోంది. విశాఖపట్టణంలో భారత బౌలర్ల విజృంభణతో ఓటమి అంచున నిలిచిన జట్టును ఒంటిచేత్తో గెలిపించిందీ పవర్ హిట్టర్. ప్రధాన పేసర్ అయిన క్రాంతి గౌడ్ ఓవర్లో సిక్సర్లతో చెలరేగిన ఈ చిచ్చరపిడుగు.. నమ్మశక్యంకాని ఇన్నింగ్స్(84 నాటౌట్ : 54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల)తో టీమిండియాకు షాకిచ్చింది.
South Africa 🇿🇦 were 81/5 in 20 overs and at that point, everyone thought it was all over for South Africans 😮
But, Chloe Tryon and Nadine de Klerk had different idea and chased down the unbelievable 👏🏻
– What’s your take 🤔 #INDWvSAW pic.twitter.com/9cllToBcjq
— Richard Kettleborough (@RichKettle07) October 9, 2025
తన విధ్వంసాన్ని ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేయకుండా.. బంగ్లాదేశ్‌పైనా గర్జించిందీ బ్యాటర్. 233 పరుగుల ఛేదనలో 198కి ఏడు వికెట్లు పడిన వేళ క్రీజులోకి వచ్చిన డీక్లెర్క్.. తన మార్క్ ఆటతో మ్యాచ్‌ను దక్షిణాఫ్రికావైపు తిప్పింది. బంగ్లా బౌలర్లను వణికిస్తూ.. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో రెచ్చిపోయిన ఈ యువ సంచలనం సఫారీలకు మూడు వికెట్ల విజయాన్ని కట్టబెట్టింది. శ్రీలంకతో మ్యాచ్‌లో కెప్టెన్ లారా వొల్వార్డ్త్, తంజిమ్ బ్రిట్స్లు హాఫ్ సెంచరీతో గెలిపించగా దక్షిణాఫ్రికాకు సెమీస్ బెర్తు దక్కింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఛాన్స్ రాకపోయినా.. పాకిస్థాన్‌పై తన ప్రతాపం చూపించింది డీక్లెర్క్.
A well-paced 90 from Laura Wolvaardt, brisk half-centuries for Sune Luus and Marizanne Kapp, and a whirlwind 41 off 16 from Nadine de Klerk help South Africa finish with a massive 312 in just 40 overs.#SAvPAK #ICCWomensWorldCup2025 pic.twitter.com/8MRXzICLGE
— Cricbuzz (@cricbuzz) October 21, 2025
వరుసగా రెండు వికెట్లు పడడంతో దక్షిణాఫ్రికా 280కే పరిమితం అవుతుందనిపించింది. కానీ, ప్రపంచ కప్‌లో ఫినిషర్‌గా రాణిస్తున్న నడినే డీక్లెర్క్ (41: 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వస్తూ వస్తూనే పాక్ బౌలర్లకు చుక్కలు చూపెట్టింది. ఫాతిమా సనా వేసిన 39వ ఓవర్లో 6, 4, 6, 6తో 25 పరుగులు పిండుకొన్న డీక్లెర్క్ స్కోర్ మూడొందలు దాటించింది. చివరి ఓవర్ తొలి బంతిని బౌండరీకి పంపిన ఈ చిచ్చరపిడుగు.. మరో షాట్‌కు యత్నించి పర్వేజ్ చేతికి దొరికింది. మరినే సిక్సర్ సంధించగా 9 వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా 312 పరుగులు చేసింది. తనదైన మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు కొండంత స్కోర్‌ను అందించింది డీక్లెర్క్. ఇదే తరహాలో తను సెమీస్‌లో.. ఆపై ఫైనల్లోనూ దంచేసిందంటే దక్షిణాఫ్రికా ఈసారి ఛాంపియన్‌గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.