DC vs RR | చివరి ఓవర్లో గందరగోళం.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లె చివరి ఓవర్లో జరిగిన గందరగోళంతో ఢిల్లీ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. చివరి రెండు ఓవర్లలో 36 పరుగులు అవసరమైన దశలో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో ఒక వికెట్ తీసుకొని, ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో చివరి ఓవర్లో 36 పరుగులు అవసరమయ్యాయి. ఇలాంటి సమయంలో ఓబెడ్ మెక్కాయ్ బౌలింగ్‌కు వచ్చాడు.
బ్యాటింగ్ చేస్తున్న రోవ్‌మెన్ పావెల్ (36) తొలి మూడు బంతులకు మూడు భారీ సిక్సర్లు బాదాడు. అయితే మూడో బంతి ఫుల్‌టాస్ వేశాడు మెక్కాయ్. అది నోబాల్ అని ఢిల్లీ జట్టు అభిప్రాయపడింది. దీంతో కెప్టెన్ రిషభ్ పంత్, కోచింగ్ సిబ్బంది గందరగోళానికి తెరతీశారు. తమ జట్టు సభ్యులకు ఆడకుండా తిరిగి వచ్చేయాలని పంత్ సైగలు చేశాడు. అయితే అంపైర్లు మాత్రం అది నోబాల్ కాదని గట్టిగా చెప్పేశారు. ఈ గందరగోళంతో మొమెంటం దెబ్బ తిన్న పావెల్.. ఆ తర్వాతి బంతికి భారీ షాట్ కొట్టబోయి మిస్ అయ్యాడు.
మరుసటి బంతికి రెండు పరుగులు రాగా.. చివరి బంతికి మరోసారి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. విజయానికి 15 పరుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో రాజస్థాన్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఈ విజయంతో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌గా మారింది. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, అశ్విన్ 2 వికెట్లు తీయగా.. చాహల్, మెక్కాయ్ చెరో వికెట్ తీసుకున్నారు.
This team. 💗 pic.twitter.com/2K84leQkJ0
— Rajasthan Royals (@rajasthanroyals) April 22, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- DC vs RR
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

