లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టు పరుగులు చేయడానికి చెమటోడుస్తోంది. ఓపెనర్ పృథ్వీ షా (61) ఒక్కడే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (4) పూర్తిగా నిరాశపరచగా.. తర్వాత క్రిజులోకి వచ్చిన రావ్మెన్ పావెల్ (3) కూడా మరోసారి విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో సర్ఫరాజ్ ఖాన్ (16 నాటౌట్), కెప్టెన్ రిషభ్ పంత్ (12 నాటౌట్) జట్టును గట్టుకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
పావెల్ వికెట్ తర్వాత మరో వికెట్ పడకుండా వీళ్లిద్దరూ జాగ్రత్తగా ఆడటంతో 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 99/3 స్కోరుతో నిలిచింది. లక్నో బౌలర్లలో బిష్ణోయి రెండు వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ తీసుకున్నాడు.