ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (53 నాటౌట్)తోపాటు దీపక్ హుడా (50) కూడా అద్భుతంగా రాణించాడు. ఇద్దరూ అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది.
అయితే శార్దూల్ ఠాకూర్ వేసిన 15వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హుడా.. శార్దూల్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు క్వింటన్ డీకాక్ (23)ను కూడా శార్దూల్ వెనక్కు పంపాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులతో నిలిచింది.