ఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన ప్రయాణం ఎంతో ప్రత్యేకమని వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పేర్కొన్నాడు. తన మాజీ ఫ్రాంచైజీ, అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌తో నా ప్రయాణం ఎంతో ప్రత్యేకం. టీనేజర్‌గా ఇక్కడకు వచ్చి ఎంతో నేర్చుకున్నాను. అది నా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. ఇక్కడ నాకు ఎన్నో అపురూపమైన క్షణాలున్నాయి. నా జీవితంలో అత్యంత క్లిష్ట సమయంలో అభిమానులు నాకు అండగా నిలిచారు. నేనెక్కడున్నా ఆ ప్రేమాభిమానాలు నా హృదయంలో పదిలంగా ఉంటాయి. మైదానంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. నాకు అండగా ఉండి నా ప్రయాణాన్ని ఎంతో ప్రత్యేకంగా మలిచినందుకు కృతజ్ఞతలు’ అని అతడు రాసుకొచ్చాడు.
పంత్ పోస్ట్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందించాడు. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘రిషభ్.. నువ్వు ఎప్పటికీ నా సోదరుడితో సమానం. నువ్వు ఢిల్లీని వదిలివెళ్లడం బాధగా ఉండటమే గాక నన్ను తీవ్రంగా కలిచివేసింది. నువ్వెప్పుడూ డీసీతోనే ఉంటావు. మనం త్వరలోనే మళ్లీ కలుస్తామని నేను ఆశిస్తున్న్తా’ అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు పంత్ కూడా ‘థ్యాంక్యూ భయ్యా..’ అని రిైప్లె ఇచ్చాడు.