అడిలైడ్ : ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ గాయపడడంతో గురువారం భారత్‌తో జరిగే సెమీఫైనల్‌కు అతడు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. శనివారం శ్రీలంకతో జరిగిన సూపర్-12 మ్యాచ్ సందర్భంగా మలన్ గాయపడ్డాడు. మ్యాచ్ సమయానికి మలన్ కోలుకోకుంటే అతని స్థానంలో రిజర్వ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ ఆడే అవకాశం ఉంది.