న్యూఢిల్లీ: భారత డెవిస్ కప్ జట్టు కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బృందానికి చెఫ్ డి మిషన్ గా వ్యవహరించనున్నాడు. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న ఈ మెగా గేమ్స్ కోసం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) రవి బెంగానీని డిప్యూటీ చెఫ్ డి మిషన్‌గా నియమించింది. వందన రావు, రాహుల్ స్వామి టీమ్ మేనేజర్లుగా భారత బృందంతో ప్రయాణించనున్నారు. ఐఓఏ ప్రెసిఎంట్ పీటీ ఉష, సీఈఓ రఘురామ్ అయ్యర్, లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ కూడిన సీనియర్ ప్రతినిధి బృందం కూడా ఈ క్రీడలకు హాజరుకానుంది.