సెయింట్‌లూసియా: పదిహేనేండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు డేవిడ్ వార్నర్ వీడ్కోలు పలికాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్న వార్నర్.. టీ20 ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతానని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం భారత్ చేతిలో ఆసీస్ ఓటమితో పాటు బంగ్లాదేశ్‌ను ఓడించిన అఫ్గానిస్థాన్.. ఆసీస్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లడంతో వార్నర్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డైట్టెంది. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వార్నర్.. 110 టీ20లు, 112 టెస్టులు, 161 వన్డేలు ఆడాడు.