ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న
డేవిడ్ వార్నర్‌ను తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో చాలా మందే ఫాలో అవుతుంటారు.
తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించే వార్నర్ ఖాళీ సమయం దొరికినా సోషల్‌మీడియాలో
అలరిస్తుంటాడు. ముఖ్యంగా తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతుంటాడు. తాజాగా అభిమానుల కోసం వార్నర్ తెలుగులో చేసిన ట్వీట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ తన భార్య క్యాండీ వార్నర్‌కు మే 27న డేవిడ్ వార్నర్ తెలుగులో శుభాకాంక్షలు తెలిపాడు. తాజాగా నేను మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తాను అభిమానులారా. మీకు నా మీద ఉండే ప్రేమకి, ఇంకా మీ సహకారానికి ధన్యవాదాలు’ అంటూ శుక్రవారం ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ 2021 సీజన్లో సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీ నుంచి వార్నర్‌ను తప్పించిన విషయం తెలిసిందే. తుది జట్టులోనూ అతనికి చోటు దక్కలేదు.
Nenu mimalni eppatiki premistanu abhimanulara. Meeku naa meeda unde prema ki, inka mee sahakaraniki dhanyavadhalu!❤️🙏🏼 #grateful #cricket #staysafe https://t.co/QqErUPv1yB
— David Warner (@davidwarner31) May 28, 2021