Mohammed Kaif: కైఫ్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ వార్నర్.. వరల్డ్ కప్ లో బెస్ట్ టీమ్ మాదేనంటూ..
Mohammed Kaif: వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియన్లకు కోపం తెప్పించాయి. స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కైఫ్...
Mohammed Kaif: వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియన్లకు కోపం తెప్పించాయి. స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కైఫ్ మాట్లాడుతూ… ‘ఈ వరల్డ్ కప్‌ను బెస్ట్ టీమ్ గెలుచుకుందంటే నేను అస్సలే ఒప్పుకోను. పేపర్‌పై భారత జట్టే బెస్ట్ టీమ్..’అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు.
వార్నర్ స్పందిస్తూ.. ‘నాకు మహ్మద్ కైఫ్ అంటే ఇష్టం. కానీ ఆయన చెప్పినట్టు పేపర్ మీద ఎవరు గొప్ప అన్నది కాదు. ఫీల్డ్‌లో ఎవరు గొప్పగా ఆడారు..? అన్నదే ముఖ్యం. అందుకే దానిని ఫైనల్ అని పిలుస్తారు. ఆ రోజే లెక్కలోకి వస్తుంది..’ అని కౌంటర్ ఇచ్చాడు.
I like MK, issue is it does not matter what’s on paper. At the end of the day you need to perform when it matters. That’s why they call it a final. That’s the day that counts and it can go either way, that’s sports. 2027 here we come 👍 https://t.co/DBDOCagG2r
— David Warner (@davidwarner31) November 22, 2023
ఇదే విషయమై ఆసీస్ క్రికెట్ కామెంటేటర్ గ్లెన్ మిచెల్ స్పందిస్తూ.. ‘వరల్డ్ కప్ ఫైనల్ అనేది గెలిచేది గ్రౌండ్లో తప్ప పేపర్ మీద కాదని ఈ మాజీ ఇండియన్ బ్యాటర్‌కు చెప్పండి..’ అని రాసుకొచ్చాడు.
I think someone needs to remind former Indian batter, Mohammad Kaif that World Cup finals are won on a cricket field and not on paper
🏏 #ICCCricketWorldCup #INDvAUS pic.twitter.com/l77gmL6xdw
— Glenn Mitchell (@MitchellGlenn) November 21, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

