ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. కానీ సెంచరీ చేయలేకపోతున్నాడు. తొలి యాషెస్ టెస్టులో 90ల్లో అవుటైన అతను.. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో కూడా 95 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఇలా అవుటై మైదానాన్ని వీడుతున్న సమయంలో చాలా మంది అభిమానులు చప్పట్లు కొడుతూ అతన్ని అభినందించారు.
ఇలా పెవిలియన్ చేరిన వార్నర్.. తను వేసుకున్న గ్లౌవ్స్ తీసి స్టేడియంలో ఉన్న ఒక యువ అభిమానికి అందించాడు. ఇదంతా కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వార్నర్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో కూడా ఆసీస్ జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
Day = made#Ashes pic.twitter.com/3srONbrDky
— cricket.com.au (@cricketcomau) December 16, 2021