న్యూఢిల్లీ: ఐపీఎల్లో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ డేవిడ్ వార్నర్(David Warner) రైట్హ్యాండ్తో బ్యాటింగ్ చేశాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌ను హృతిక్ షోకీన్ వేశాడు. అయితే సాధారణంగా లెఫ్ట్‌హ్యాండ్(Left Hand) బ్యాటింగ్ చేసే వార్నర్.. ఆ ఓవర్లో ఓ బంతిని రైట్‌హ్యాండ్ స్టాన్స్ తీసుకుని ఆడాడు. హృతిక్ నోబ్ వేయడం వల్ల వార్నర్‌కు ఫ్రీ హిట్ దొరికింది. దీంతో అతను ఆ బంతిని రైట్‌హ్యాండ్ షాట్‌గా ఆడాడు. స్పిన్నర్ హృతిక్ వేసిన ఆ ఎక్స్ట్రా బంతిని .. రైట్‌హ్యాండ్ షాట్‌తో వార్నర్ ఉపయోగించుకోలేకపోయాడు. ఆ ఫ్రీ హిట్ బాల్‌కు కేవలం ఒక్క రన్ మాత్రమే వచ్చింది.
david warner right hand batsman pic.twitter.com/Z85XehwSrS
— LUCKY SINGH (@LokeshS30714400) April 11, 2023
డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో 51 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఐపీఎల్లో వార్నర్‌కు ఇది 58వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఢిల్లీ విసిరిన 173 పరుగుల లక్ష్యాన్ని.. ముంబై జట్టు చివరి బంతికి ఛేజ్ చేసింది.