David Warner : సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో భారత జట్టు(Team India) ఆఖరి మెట్టుపై బోల్తా పడడం కోట్లాది మంది గుండెల్ని పిండేసింది. అది కూడా 2003 ఫైనల్లో కప్పును లాగేసుకున్న ఆస్ట్రేలియా(Australia) చేతిలో ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమయంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) సోషల్‌మీడియా వేదికగా భారత అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.
‘వరల్డ్ గెప్ గెలిచినందుకు క్షమాపణలు చెప్తున్నా. వరల్డ్ కప్ ఫైనల్ నిజంగా ఒక అద్బుతమైన మ్యాచ్. అహ్మదాబాద్ స్టేడియం వాతావరణం చాలా గొప్పగా ఉంది. భారత జట్టు చాలా తీవ్రంగా ప్రయత్నించింది. అందరికీ ధన్యవాదాలు’ అని వార్నర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.
I apologise, it was such a great game and the atmosphere was incredible. India really put on a serious event. Thank you all https://t.co/5XUgHgop6b
— David Warner (@davidwarner31) November 20, 2023
వార్నర్ సారీ చెప్పడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..? టీమిండియా ఓటమిని తట్టుకోలేని ఒక అభిమాని ఒకరు ‘నువ్వు కోట్లాది గుండెల్ని ముక్కలు చేశావు’ అని వార్నర్‌కు పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసి భారతీయుల బాధను అర్ధం చేసుకొన్న డేవిడ్ భాయ్.. వరల్డ్ కప్ గెలిచినందుకు క్షమాపణలు చెప్తున్నా అని స్పందించాడు. తద్వారా ఈ డాషింగ్ ఓపెనర్ ఇండియన్స్ పట్ల తనకున్న అభిమాన్ని మరోసారి చాటుకున్నాడు. ప్రపంచ కప్ ఫైనల్లో భారత్‌పై 6 వికెట్లతో గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ ఏడాది జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు గద(Test Mace)ను తన్నుకుపోయిన కమిన్స్ సేన ఈసారి వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోవడం ఇండియన్ ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు.