బెంగళూరు: భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 52 ఏండ్ల జాన్సన్.. బెంగళూరులోని కోతనూరు కనక శ్రీ లే అవుట్ వద్ద తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడి మరణించడం అనుమానాలకు తావిస్తోంది. ఆయన ప్రమాదవశాత్తు పడిపోయాడని చెబుతున్నప్పటికీ జాన్సన్.. దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా మానసికంగా ఆయన ఆరోగ్యం సరిగ్గా లేనట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించాడు.