ముంబై : ఐసీసీ మెన్స్ వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్(Daryl Mitchell) తొలి స్థానాన్ని ఆక్రమించేశాడు. తాజాగా భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన ఆ బ్యాటర్ .. విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 9 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 54 ఇన్సింగ్స్‌ల్లో అతను 9 సెంచరీలు కొట్టాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో మిచెల్ 352 రన్స్ స్కోరు చేశాడు. డారెల్ మిచెల్ 845 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 795 పాయింట్లతో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. వన్డే క్రికెట్లో మిచెల్ మొదటి ర్యాంక్ దక్కించుకోవడం ఇది రెండోసారి.
Virat Kohli’s reign as the No.1 ODI batter is over as an in-form New Zealander rises to the top 😲
Details 👇https://t.co/G5NUvco7AM
— ICC (@ICC) January 21, 2026